కేరళలో ‘కూలీ’ హవా మామూలుగా లేదు !

కేరళలో ‘కూలీ’ హవా మామూలుగా లేదు !
X
కేరళలో ‘కూలీ’ మూవీ టికెట్లు ఆన్‌లైన్‌లో వచ్చిన మూడు గంటల్లోనే 1.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి, సుమారు 1,300 షోల నుంచి దాదాపు రూ. 2.5 కోట్లు వసూలైంది.

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కొత్త సినిమా ‘కూలీ’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యరాజ్, ఆమిర్ ఖాన్, నాగార్జున, సౌబిన్ షాహిర్ లాంటి హేమాహేమీలు నటిస్తున్నారు. 75 ఏళ్ల వయసులో కూడా రజనీకాంత్ సూపర్‌స్టార్ హవా కొనసాగడం అద్భుతం. ఫ్యాన్స్ ఉత్సాహం మామూలుగా లేదు.

అసలు మేటరుకొస్తే .. కేరళలో ‘కూలీ’ మూవీ టికెట్లు ఆన్‌లైన్‌లో వచ్చిన మూడు గంటల్లోనే 1.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి, సుమారు 1,300 షోల నుంచి దాదాపు రూ. 2.5 కోట్లు వసూలైంది. ఇది సినిమాకు బంపర్ ఓపెనింగ్ ఖాయమని సంకేతం. సినిమా హిట్ అయ్యి.. పాజిటివ్ టాక్ వస్తే, ‘కూలీ’ మూవీ సౌత్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించొచ్చు.

అనిరుద్ సంగీతం ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తోంది. కొన్ని చోట్ల ముందస్తు స్క్రీనింగ్‌లు కూడా ఉండొచ్చని టాక్. త్వరలో డీటెయిల్స్ వస్తాయని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14, 2025న వివిధ భాషల్లో విడుదల కానుంది. తలైవర్ మళ్లీ స్క్రీన్ మీద సందడి చేయడానికి ఫ్యాన్స్ గంటలు లెక్కిస్తున్నారు.

Tags

Next Story