‘కాంతార’ ప్రీక్వెల్ లో కంప్లీట్ యాక్టర్ ?

రిషబ్ శెట్టి హీరోగా, తనే దర్శకత్వం వహిస్తున్న "కాంతార: ఛాప్టర్ 1" పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొని ఉంది. ఈ ప్రీక్వెల్‌పై భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరికీ ఆసక్తికరమైన వార్త ఏమిటంటే .. మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తే కానీ నిజమైతే, "కాంతార: ఛాప్టర్ 1" ఒక సింపుల్ మస్ట్-వాచ్ సినిమాగా కాకుండా.. నిజమైన మ్యానియా గా మారిపో తుందనడంలో సందేహం లేదు.
ఇప్పటికే ఈ చిత్రం ఇండియన్ స్ర్కీన్ పైనే అత్యంత ఆసక్తికరమైన సినిమాగా మారింది. అలాంటి ఈ సినిమాలో మోహన్‌లాల్ కూడా జతకూడితే అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో.. రిషబ్ శెట్టి, ఆయన భార్య ప్రగతి, గత ఏప్రిల్‌లో మోహన్‌లాల్‌ను కలిసిన ఫోటోలు బయటకు రావడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి. "కాంతార: ఛాప్టర్ 1" కథ కదంబ రాజవంశ కాలంలో జరుగుతుందని సమాచారం. మొదటి భాగం సూపర్ సక్సెస్ అవడంతో రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు, రిషబ్ శెట్టి ఒక పురాతనమైన, పవిత్రమైన అవతారంలో దర్శనమిచ్చాడు.
"కాంతార" చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించిన అజనీష్ లోక్ నాథ్.. ఈ ప్రీక్వెల్‌కి కూడా సంగీతం సమకూరుస్తున్నాడు. మొదటి చిత్రంలో పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇప్పుడు "కాంతార: ఛాప్టర్ 1" లో మరింత శక్తివంతమైన సంగీతాన్ని అందించేందుకు అజనీష్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రిషబ్ శెట్టి, మోహన్‌లాల్ కలిసి తెరపై కనిపిస్తే.. అది నిజంగా ఓ విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఈ ఇద్దరూ అత్యద్భుతమైన నటనను అందించగల ప్రతిభావంతులైన నటులు కావడంతో, "కాంతార: ఛాప్టర్ 1" అంచనాలను దాటి ఓ మైలు రాయిగా నిలిచే అవకాశం ఉంది.
-
Home
-
Menu