రష్మిక భద్రతపై ఆందోళన

కన్నడ చిత్ర పరిశ్రమను అవమానించిందనే ఆరోపణలతో రష్మిక మందన్నా చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. రష్మిక కర్ణాటకకు సంబంధించిన కొడవ కులానికి చెందిన వ్యక్తి. అందుకే కొడవ నేషనల్ కౌన్సిల్ (CNC) ఆమెకు భద్రత కల్పించాల్సిందిగా కర్ణాటక, కేంద్ర హోం మంత్రులను కోరింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ ఇటీవల రష్మికపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆమె హాజరుకాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. 'కిరిక్ పార్టీ' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై CNC ప్రెసిడెంట్ నాచప్ప స్పందిస్తూ, రష్మికను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె విజయానికి రాజకీయాలు కారణం కాదని, ఆమెను రాజకీయ ప్రయోజనాల కోసం టార్గెట్ చేయరాదని స్పష్టం చేశారు.
ఇక కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర ఈ విషయంలో తనకు CNC నుంచి ఎలాంటి లేఖ రాలేదని, కానీ దీనిని సమీక్షిస్తానని తెలిపారు. మరోవైపు, రష్మికపై విమర్శలు పెరిగినా, ఆమె ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు.
-
Home
-
Menu