‘ఇడ్లీ కడై’ లో వీళ్ళ పాత్రలేంటి?

‘ఇడ్లీ కడై’ లో వీళ్ళ పాత్రలేంటి?
X
గతంలో విడుదలైన పోస్టర్ల ద్వారా ఆయన బాక్సర్ పాత్రలో నటిస్తున్నట్లు అర్ధమైంది. ఇందులో ధనుష్ పాత్రకు సహాయకుడిగా ఉంటాడు.

ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన మూడో చిత్రం 'ఇడ్లీ కడై'. ఈ మూవీలో అరుణ్ విజయ్ పాత్ర వివరాలను చిత్ర బృందం వెల్లడించింది. ధనుష్ గతంలో 'పా పాండి' , 'రాయన్' చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అరుణ్ విజయ్ ఈ చిత్రంలో అశ్విన్ అనే పాత్రలో కనిపించనున్నారు. గతంలో విడుదలైన పోస్టర్ల ద్వారా ఆయన బాక్సర్ పాత్రలో నటిస్తున్నట్లు అర్ధమైంది. ఇందులో ధనుష్ పాత్రకు సహాయకుడిగా ఉంటాడు.

ధనుష్ పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా బయటపడలేదు. తాజా పోస్టర్‌లో అరుణ్ విజయ్ దుబాయ్ నేపథ్యంలో కనిపించాడు. ధనుష్, అరుణ్ విజయ్‌తో పాటు ఈ చిత్రంలో నిత్యా మీనన్, రాజ్‌కిరణ్, సముద్రఖని నటిస్తుండగా, పార్థిబన్ ఒక చిన్న పాత్రలో కనిపించనున్నారు.

'ఇడ్లీ కడై' అక్టోబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఆకాశ్ భాస్కరన్ తన డాన్ పిక్చర్స్ బ్యానర్‌తో, ధనుష్ తన వండర్‌బార్ పిక్చర్స్ బ్యానర్‌తో నిర్మిస్తున్నారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఇన్బన్ ఉదయనిధి ఈ చిత్రం ద్వారా డిస్ట్రిబ్యూటర్‌గా తొలి క్రెడిట్ పొందనున్నారు.

Tags

Next Story