కన్నడ చిత్రంలోనూ అనురాగ కశ్యప్ అరంగేట్రం !

బాలీవుడ్ పరిశ్రమలో తన ప్రత్యేకమైన స్టైల్‌తో దర్శకుడిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రస్థానం కొనసాగిస్తున్న అనురాగ్ కశ్యప్.. ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై దృష్టి కేంద్రీకరించాడు. ఇప్పటికే తమిళం, మలయాళంలో నటించిన అనురాగ్, ఇప్పుడు కన్నడలో అరంగేట్రం చేయనున్నాడు. సుజయ్ శాస్త్రి దర్శకత్వంలో రూపొందుతున్న '8' అనే స్పోర్ట్స్ డ్రామాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో సూపర్ మోడల్ నుంచి నటి అయిన ఆయేషా గెస్ట్ రోల్‌లో నటించడం మరో విశేషం. అయితే, అనురాగ్ పాత్ర వివరాలు ఇంకా రహస్యంగానే ఉంచారు. సినిమా షూటింగ్‌ను 27 రోజులలో ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాక.. అనురాగ్ 'వఘచిపాణి' అనే మరో కన్నడ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెడ్రో ఫేమ్ నతేష్ హెగ్డే దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే 'మహారాజా' (తమిళం), 'రైఫిల్ క్లబ్' (మలయాళం) చిత్రాలలో ప్రతినాయకుడిగా నటించిన అనురాగ్, 'విడుతలై పార్ట్ 2' లో ఓ గెస్ట్ రోల్ చేశారు. తాజాగా తెలుగు లో 'డెకాయిట్' అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో అనురాగ్ కశ్యప్ తన ప్రయాణాన్ని మరింత విస్తరించుకుంటూ, కొత్త పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
-
Home
-
Menu