అభిషన్ కు జోడీగా అనస్వరా రాజన్

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ అభిషన్ జీవింత్.. సౌందర్య రజనీకాంత్ నిర్మిస్తున్న కొత్త తమిళ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్ కూడా ఈ సినిమాలో నటిస్తు్న్నట్టు సమాచారం. అభిషన్ కు జోడీగా ఆమె నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రొడక్షన్ నెం. 4 గా రూపొందుతున్న ఈ చిత్రానికి మదన్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్నాడు.
కార్తీక్ సుబ్బరాజ్ రెట్రో సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన శ్రేయాస్ కృష్ణ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తాడు. సీన్ రోల్డన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తాడని చిత్ర బృందం వెల్లడించింది. సీన్ రోల్డన్ గతంలో సౌందర్య దర్శకత్వం వహించిన ‘వేలై ఇల్లా పట్టదారీ 2’ సినిమాకు, అలాగే అభిషన్ తొలి దర్శకత్వ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కి సంగీతం అందించాడు.
అనస్వర మనీషా అనే పాత్రలో నటిస్తుంది, అభిషన్ సత్య పాత్రను పోషిస్తాడు. సౌందర్య ఈ చిత్రాన్ని పసిలియన్ నజరత్, మాగేష్ రాజ్ పసిలియన్‌తో కలిసి నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇది ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్, జియాన్ ఫిల్మ్స్ బ్యానర్‌ల ఆధ్వర్యంలో రూపొందుతోంది.
ఇది అనస్వర తొలి తమిళ చిత్రం కాదు. ఆమె సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘7జీ రెయిన్‌బో కాలనీ 2’ లో కూడా నటిస్తోంది, ఇది సెల్వరాఘవన్ సూపర్ హిట్ చిత్రం ‘7జీ రెయిన్‌బో కాలనీ’ కి సీక్వెల్. ఆ చిత్రంలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. రవి కృష్ణ ఈ సీక్వెల్‌లో తన పాత్రను మళ్లీ పోషిస్తాడు.
-
Home
-
Menu