విశాల్ 35లో అంజలి!

సౌత్ హీరోయిన్ అంజలి.. స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోవడంతో ఆమెకు ఆశించిన బ్రేక్ దొరకలేదు. అయినప్పటికీ... అంజలి ఆగకుండా ముందుకు సాగుతోంది. చిన్న గ్యాప్ తర్వాత, ఆమె మరో భారీ ప్రాజెక్ట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
అంజలి ఇప్పుడు యాక్షన్ స్టార్ విశాల్ 35వ చిత్రంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ విషయాన్ని నిర్మాతలు ఓ స్టైలిష్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కు తెలియజేశారు. రవి అరసు డైరెక్షన్‌లో, సీనియర్ నిర్మాత ఆర్‌బీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దుషారా విజయన్ విశాల్ సరసన లీడ్ హీరోయిన్‌గా కనిపించనుంది, అయితే అంజలి మరో ఇంపార్టెంట్ రోల్‌లో మెరవనుంది.
రెండు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన అంజలి, తన టాలెంట్‌తో ఇప్పటికీ పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో క్రేజీ రోల్స్ సొంతం చేసుకుంటోంది. ఈ కొత్త సినిమాతో ఆమె మరోసారి తన నటనా సత్తాను చూపించేందుకు రెడీ అవుతోంది. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ కాంబో గురించి సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా అంజలికి కావాల్సిన బిగ్ బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
-
Home
-
Menu