అనిరుధ్ మ్యాజిక్ మిస్ అవుతోందా?

అనిరుధ్ మ్యాజిక్ మిస్ అవుతోందా?
X
ఇటీవల, అనిరుద్ మ్యూజిక్ మోనోటోనస్‌గా, రిపిటిటివ్‌గా మారిపోతోందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అతని ఎక్కువ సాంగ్స్ పాత సినిమాల ట్రాక్స్‌ని రిపీట్ చేసినట్లు అనిపిస్తున్నాయి.

అనిరుధ్ రవిచందర్.. దేశంలోని స్టార్ మ్యూజిక్ కంపోజర్లలో ఒకడు. అతడు తన ఊపు కోల్పోతున్నాడా? అతని ట్యూన్స్ రిపీట్ అవుతున్నాయా? అతని స్టైల్ మ్యూజిక్‌తో జనం విసిగిపోతున్నారా? అతడి ఇటీవలి ఆల్బమ్స్ చూస్తే అదే అనిపిస్తోంది. 2024, 2025లో అనిరుద్ 'ఇండియన్ 2', 'దేవర', 'వెట్టైయన్', 'విడాముయర్చి', 'కింగ్‌డమ్', 'కూలీ', 'మదరాసి' వంటి బోలెడు సినిమాలకు సంగీతం సమకూర్చాడు.

'దేవర', 'కూలీ' తప్ప మిగిలిన సినిమాల మ్యూజిక్ ఏమాత్రం మ్యాజిక్ చేయలేదు. అనిరుధ్ అంటే ఎలాంటి సినిమాని అయినా కూడా తన ఎలక్ట్రిఫైయింగ్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో లేపడం తెలిసిన సంగతి. ఫ్లాప్ సినిమాల్లో కూడా అతని చార్ట్‌బస్టర్ సాంగ్స్, పవర్‌ఫుల్ బీజీఎం ట్రాక్స్ హైలైట్ అయ్యాయి. కానీ ఇప్పుడు అలా కనిపించడం లేదు. ఇటీవల, అనిరుద్ మ్యూజిక్ మోనోటోనస్‌గా, రిపిటిటివ్‌గా మారిపోతోందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అతని ఎక్కువ సాంగ్స్ పాత సినిమాల ట్రాక్స్‌ని రిపీట్ చేసినట్లు అనిపిస్తున్నాయి.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ అదే పరిస్థితి. ఈ రిపీట్ ట్యూన్స్‌తో జనం విసుగ్గా ఫీలై, ప్రతి సినిమాలో ఒకే ప్యాటర్న్‌ని అవాయిడ్ చేయమని అనిరుధ్ ని కోరుతున్నారు. అనిరుధ్ లేటెస్ట్ రిలీజ్ 'మదరాసి' కూడా ఫ్యాన్స్‌కి నిరాశే మిగిల్చింది. సినిమా ఓకే ఓకే అనుకున్నా.. అనిరుద్ మాత్రం ఒక్క చార్ట్‌బస్టర్ సాంగ్ లేదా పవర్‌ఫుల్ బీజీఎం ఇవ్వడంలో విఫలమయ్యాడు. అందుకే, అనిరుధ్ తన పనిని రీవ్యూ చేసుకుని, మ్యూజిక్‌ని రీఇన్వెంట్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని అనిపిస్తోంది.

Tags

Next Story