తమిళనాడు రాజకీయాల్లో కయాదు లోహర్ పేరు

తమిళనాడు రాజకీయాల్లో కయాదు లోహర్ పేరు
X
"నా పేరు మీద సర్క్యులేట్ అవుతున్న ట్విట్టర్ అకౌంట్ ఫేక్. దానికి నాకు ఏ సంబంధం లేదు, ఆ స్టేట్‌మెంట్స్ నావి కావు. కరూర్ ర్యాలీలో జరిగిన విషాదకర సంఘటనకు నేను చాలా బాధపడుతున్నాను.

యాక్టర్ జోసెఫ్ విజయ్, అలియాస్ దళపతి విజయ్.. తన పార్టీ టీవీకేను ప్రారంభించిన తర్వాత ఎదుర్కొంటున్న అతిపెద్ద రాజకీయ ఎదురుదెబ్బ ఇది. మూడు రోజుల క్రితం తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో పిల్లలతో సహా 40 మంది చనిపోయారు. ఈ సంఘటన రాష్ట్రంలో పెద్ద అలజడికి, రాజకీయ తుఫాన్‌కి దారితీసింది. ప్రధాని మోదీ, పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, నటీనటులు స్పందించి, ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు సంతాపం తెలిపారు.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉన్నందున, ఈ పరిణామాలను హ్యాండిల్ చేయడం విజయ్‌కు పెద్ద సవాల్‌గా మారింది. అధికార ప్రభుత్వం ఈ సంఘటనను అస్త్రంగా వాడుకుని, విజయ్‌ను బాధ్యత లేని నాయకుడిగా చూపిస్తూ పూర్తిగా ఇరుకున పెడుతోంది. అయితే.. రాజకీయాలు పక్కన పెడితే.. ఒక హీరోయిన్ పేరు అనుకోకుండా ఈ వివాదంలోకి రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్రాగన్' వంటి సినిమాలతో పాపులర్ అయిన హీరోయిన్ కయాదు లోహర్... కరూర్ ఘటనలో తన స్నేహితుడిని కోల్పోయానని ఆరోపిస్తూ.. విజయ్‌ను తీవ్ర పదజాలంతో ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారని వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద దుమారం రేగింది. అయితే.. ఆ తర్వాత కయాదు లోహర్ స్పష్టత ఇచ్చారు. తన పేరుతో పోస్ట్‌లు చేస్తున్న ట్విట్టర్ అకౌంట్ నకిలీదని, అందులో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు తాను చేయలేదని ఆమె ఖండించారు. ఆమె ఇలా రాశారు..

"నా పేరు మీద సర్క్యులేట్ అవుతున్న ట్విట్టర్ అకౌంట్ ఫేక్. దానికి నాకు ఏ సంబంధం లేదు, ఆ స్టేట్‌మెంట్స్ నావి కావు. కరూర్ ర్యాలీలో జరిగిన విషాదకర సంఘటనకు నేను చాలా బాధపడుతున్నాను. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. అయితే, నాకు కరూర్ లో పర్సనల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అని చాలా క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. నా పేరు మీద స్ప్రెడ్ అవుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని దయచేసి ఎవరూ నమ్మకండి, సర్క్యులేట్ చేయకండి."

తమిళనాడు రాజకీయ వివాదాలలో కయాదు లోహర్ పేరు లాగడం ఇది రెండోసారి. గతంలో... ఒక పార్టీ నాయకుడు.. డీఎంకే వ్యక్తులు ఆమెకు ఒక రాత్రికి రూ. 30 లక్షలు చెల్లించారని ఆరోపించారు. తర్వాత ఆ స్టేట్‌మెంట్‌ను ఆయన వెనక్కి తీసుకున్నారు. కయాదు లోహర్ గతంలో శ్రీ విష్ణు సరసన 'అల్లూరి' అనే తెలుగు సినిమాలో నటించారు. ఇప్పుడు ఆమె తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Tags

Next Story