‘కిష్కింధపురి‘ రిలీజ్ డేట్ ఫిక్స్

‘కిష్కింధపురి‘ రిలీజ్ డేట్ ఫిక్స్
X
'ఛత్రపతి' హిందీ రీమేక్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో వస్తున్నాడు. ఇటీవలే ‘భైరవం‘ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన బెల్లంకొండ ఇప్పుడు ‘కిష్కింధపురి‘ని రెడీ చేశాడు.

'ఛత్రపతి' హిందీ రీమేక్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో వస్తున్నాడు. ఇటీవలే ‘భైరవం‘ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన బెల్లంకొండ ఇప్పుడు ‘కిష్కింధపురి‘ని రెడీ చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా హారర్ థ్రిల్లర్ గా ‘కిష్కింధపురి‘ రూపొందుతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

సెప్టెంబర్ 12న ‘కిష్కింధపుర‘ విడుదల తేదీని ఖరారు చేసుకుంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘రాక్షసుడు‘ వంటి థ్రిల్లర్ తర్వాత బెల్లంకొండ, అనుపమ కలిసి నటిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ థియేటర్లలో మరింతగా భయటపెట్టబోతున్నట్టు ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా.. ‘భైరవం‘తో ఆశించిన స్థాయిలో అలరించలేకపోయిన బెల్లంకొండ వారబ్బాయి ఇప్పుడు ‘కిష్కింధపురి‘తో హిట్ కొడతాడేమో చూడాలి.



Tags

Next Story