‘కిష్కింధపురి’ మూవీ హైలైట్స్

‘కిష్కింధపురి’ మూవీ హైలైట్స్
X
మాస్, యాక్షన్, హై బడ్జెట్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి ‘కిష్కింధపురి‘ అంటూ ప్రేక్షకుల ముందుకు ఒక కొత్త జోనర్‌లో వస్తున్నాడు.

మాస్, యాక్షన్, హై బడ్జెట్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి ‘కిష్కింధపురి‘ అంటూ ప్రేక్షకుల ముందుకు ఒక కొత్త జోనర్‌లో వస్తున్నాడు. ఈ చిత్రంలో బెల్లంకొండకి జోడీగా అనుపమ నటించింది. కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

‘కిష్కింధపురి‘ సినిమా 2 గంటల 5 నిమిషాలు మాత్రమే. క్రిస్ప్ & ఎఫెక్టివ్ నేరేషన్ తో ఈ చిత్రం సాగనుందట. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) జీరో కట్స్‌తో A సర్టిఫికేట్ ఇచ్చింది. హారర్ ఎలిమెంట్స్, భయానక సన్నివేశాల కారణంగా ఆడల్ట్స్ ఓన్లీ కేటగిరీలోకి వెళ్లింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ‘ఇంత సీరియస్ హారర్ సినిమా చాలా కాలం తర్వాత చూశాం‘ అనే కాంప్లిమెంట్స్ అందించారట.

అనుపమ పరమేశ్వరన్ ఘోస్ట్ పాత్రలో కనిపించనుంది. ఆమె ఎమోషనల్ పర్ఫార్మెన్స్ సినిమాకి హైలెట్ అని టాక్. బెల్లంకొండ శ్రీనివాస్ పాత్రలో యాక్షన్‌తో పాటు కొత్త శైలి నటన ఆకట్టుకోనుందట. కథనం సీట్ ఎడ్జ్ థ్రిల్ కలిగించేలా వుంటుందని ఇప్పటికే స్పెషల్ షోస్ చూసిన వాళ్లు చెబుతున్నారు.

టెక్నికల్ గా ‘కిష్కింధపురి‘కి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇలాంటి హారర్ మూవీస్ కి సౌండ్ డిజైన్ చాలా కీలకం. ఈ సినిమాకి సౌండ్ డిజైనర్ గా ‘సలార్, యానిమల్, కాంతారా‘ ఫేమ్ రాధాకృష్ణ పనిచేశాడు. ఆయన అందించిన సౌండ్ డిజైన్ మైండ్‌బ్లోయింగ్ గా ఉంటుందట. ఇక.. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్, జీ కనిష్క–చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీ, నిరంజన్ దేవరమనే ఎడిటింగ్ కలిసి టెక్నికల్ గా ‘కిష్కింధపురి‘ని మరో లెవెల్ లో నిలబెడతాయనే నమ్మకం టీమ్ లో ఉంది.

హారర్ మాత్రమే కాదు, హైపర్ ఆది, సుదర్శన్ వంటి కమెడియన్స్ ఈ చిత్రంలో వినోదంతో కడుపుబ్బా నవ్వించబోతున్నారు. మొత్తంగా.. భారీ అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ‘కిష్కింధపురి‘కి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Tags

Next Story