కిరణ్ కొత్త సినిమాకి ‘క‘ సెంటిమెంట్!

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. ముఖ్యంగా టైటిల్స్ విషయంలో గత చిత్రాల తాలూకు సెంటిమెంట్స్ ను ఫాలో అవుతుంటారు. గతంలో కె.విశ్వనాథ్ ‘ఎస్‘ అక్షరంతో తన సినిమాల టైటిల్స్ ను ఎక్కువగా పెట్టేవారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ‘ అక్షరంతో సినిమాలను రూపొందించడానికి ఉత్సాహాన్ని చూపుతారు.
ఇప్పుడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి ‘క‘ అక్షరం సెంటిమెంట్ గా మారింది. తన పేరులోని మొదటి అక్షరమైన ‘క‘తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కిరణ్. ఇప్పుడు లేటెస్ట్ మూవీకి కూడా ‘కె ర్యాంప్‘ అనే టైటిల్ నిర్ణయించారు. ఈరోజు ‘కె ర్యాంప్‘ చిత్రం ముహూర్తాన్ని జరుపుకుంది.
కిరణ్, యుక్తి తరేజా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి జైన్స్ నాని దర్శకుడు. హాస్య మూవీస్ పై ఈ సినిమాని రాజేష్ దండా నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. సతీష్ రెడ్డి మాసమ్ సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్స్ గా వ్యవహరిస్తున్నారు. ‘కె ర్యాంప్‘ మూవీ అనౌన్స్ మెంట్ చేస్తూ ఓ ఆసక్తికర వీడియోని రిలీజ్ చేసింది టీమ్. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.
-
Home
-
Menu