కిరణ్ ‘కె ర్యాంప్‘ షురూ!

కిరణ్ ‘కె ర్యాంప్‘ షురూ!
X
టాలీవుడ్‌లో ప్రతిభావంతులైన హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం. ‘క‘ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కిరణ్.. ఆ తర్వాత ‘దిల్ రూబా‘తో ఆడియన్స్ ను పలకరించాడు.

టాలీవుడ్‌లో ప్రతిభావంతులైన హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం. ‘క‘ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కిరణ్.. ఆ తర్వాత ‘దిల్ రూబా‘తో ఆడియన్స్ ను పలకరించాడు.అయితే ‘దిల్ రూబా‘ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

లేటెస్ట్ గా కిరణ్ అబ్బవరం తన నెక్స్ట్ మూవీ ‘కె ర్యాంప్‘ను షురూ చేశాడు. ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ మొదలు పెట్టుకుంది. ‘ఫన్ బిగిన్స్‘ అంటూ కేరళలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలియజేసే ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

కిరణ్, యుక్తి తరేజా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి జైన్స్ నాని దర్శకుడు. హాస్య మూవీస్ పై ఈ సినిమాని రాజేష్ దండా నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. సతీష్ రెడ్డి మాసమ్ సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్స్ గా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా ‘క‘ టైటిల్ సెంటిమెంట్ తో వస్తోన్న ‘కె ర్యాంప్‘ కూడా కిరణ్ కి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.



Tags

Next Story