కింగ్డమ్ vs భైరవం

కింగ్డమ్ vs భైరవం
X
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో మళ్లీ హిట్ ట్రాక్‌ పైకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. గౌతమ్ తిన్నమూరి దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నాగవంశీ నిర్మించారు.

విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో మళ్లీ హిట్ ట్రాక్‌ పైకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. గౌతమ్ తిన్నమూరి దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నాగవంశీ నిర్మించారు. టీజర్ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎలాంటి పోటీ లేకుండా మే 30న 'కింగ్డమ్' వస్తోంది? అనుకున్నారంతా. కానీ.. ఇప్పుడు 'కింగ్డమ్'కి మరో మూవీ పోటీగా వచ్చేస్తుంది.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'భైరవం' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మే 30న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ చిత్రం 'గరుడన్'కి రీమేక్.

శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తుండగా.. సత్య సాయి ఆర్ట్స్, జయంతిలాల్ గడా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తంగా.. 'కింగ్డమ్' పాన్ ఇండియా లెవెల్ లో వస్తుంటే.. 'భైరవం' తెలుగులో మాత్రమే విడుదలవుతుంది.

Tags

Next Story