‘కింగ్డమ్’ సెకండ్ సింగిల్ అప్డేట్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, యూత్ మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘హృదయం లోపల’ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్‌ను షేర్ చేశారు మేకర్స్. ‘అన్న అంటేనే..’ అనే ఎమోషనల్ సాంగ్‌ను జూలై 15న సాయంత్రం 5:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ పాట అన్నా-తమ్ముల అనుబంధాన్ని హృదయాన్ని తాకేలా చూపించనుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అన్న పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌లో చిన్నతనంలో అన్నదమ్ములు కలిసి ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు. జూలై 31న ‘కింగ్డమ్‘ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది.
There’s no bond like the one between brothers forged in childhood, tested over time and unbreakable forever. 👬#Kingdom Second Single #AnnaAntene Promo out tomorrow at 5:05PM. 🤩
— Sithara Entertainments (@SitharaEnts) July 14, 2025
An @anirudhofficial’s Musical Vibe ❤️#KingdomOnJuly31st 🔥@TheDeverakonda @gowtam19… pic.twitter.com/yScWn7oZ3e
-
Home
-
Menu