'కింగ్డమ్' సెన్సార్ రిపోర్ట్!

కింగ్డమ్ సెన్సార్ రిపోర్ట్!
X
విజయ్ దేవరకొండ స్పై యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’ రిలీజ్ కు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

విజయ్ దేవరకొండ స్పై యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’ రిలీజ్ కు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందిన ఈ చిత్రానికి 160 నిమిషాల (2 గంటలు 40 నిమిషాలు) రన్‌టైమ్ ఫిక్స్ చేశారు.

సెన్సార్ బోర్డు సూచనల మేరకు, సినిమా నుంచి కొన్ని అభ్యంతరకర డైలాగులు, సన్నివేశాలను తొలగించారు. మొత్తం 2 నిమిషాల 31 సెకన్ల కంటెంట్‌ను మార్చారు. ఒక డైలాగ్‌ను మ్యూట్ చేయడం, అసభ్య పదాన్ని తొలగించడం, హింసాత్మక సన్నివేశాలను సీజీ ద్వారా కవర్ చేయడం వంటి మార్పులు చేశారు.

ప్రచారంలో భాగంగా నిన్న విజయ్ దేవరకొండ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఫ్యాన్స్‌ను కలిసిన సందర్భంలో వారికోసం భోజనం ఏర్పాటు చేయడం హైలైట్‌గా మారింది. అలాగే యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. విడుదలకు ముందు ‘కింగ్డమ్’పై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడంతో సినిమా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం మేకర్స్ లో ఉంది.

Tags

Next Story