సెంచరీ కొట్టబోతున్న ‘కింగ్డమ్‘

సెంచరీ కొట్టబోతున్న ‘కింగ్డమ్‘
X
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్‘ చిత్రం విడుదల తర్వాత మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినా.. కలెక్షన్లలో మాత్రం అదరగొడుతుంది.

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్‘ చిత్రం విడుదల తర్వాత మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినా.. కలెక్షన్లలో మాత్రం అదరగొడుతుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న విజయ్ కి ‘కింగ్డమ్‘ కొంత వరకూ ఆశాజనకమైన ఫలితాన్నే అందించిందని చెప్పొచ్చు. విడుదలైన నాలుగు రోజులకు ఈ చిత్రం రూ.82 కోట్లు వసూళ్లు సాధించింది. లాంగ్ రన్ లో ఈ మూవీ వంద కోట్లు వసూళ్లు సాధించొచ్చనే అంచనాలున్నాయి.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.



Tags

Next Story