సెంచరీకి సిద్ధమైన కింగ్!

ప్రస్తుతం ‘కుబేర’ సక్సెస్ జోష్‌లో ఉన్న కింగ్ నాగార్జున, త్వరలో తన 100వ సినిమా ప్రకటన చేయడానికి సిద్ధమవుతున్నాడు. సోలో హీరోగా ఇది ఆయన సెంచరీ చిత్రం కానుండటంతో, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ కు ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందబోయే ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్ మేళవింపు తో కూడిన ఎంటర్టైనర్‌గా ఉండనుందట.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడట. ఇప్పటికే 'మన్మథుడు, మాస్, కింగ్' వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన డిఎస్పీపై నాగ్ మళ్లీ ఫోకస్ పెట్టడం విశేషం. అందుకు మరో కారణం లేటెస్ట్ హిట్ 'కుబేర'. ఇక ‘నా సామిరంగా’ తర్వాత సోలో హీరోగా నాగార్జున చేస్తున్న చిత్రం ఇదే కావడం మరో ప్రత్యేకత.
అక్కినేని ఫ్యాన్స్ కథనం ప్రకారం, గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. టైటిల్‌గా ‘కింగ్ 100’ను పరిశీలిస్తున్నా, ఇంకా ఫైనల్ కాదు. వచ్చే ఏడాది రిలీజ్ టార్గెట్ గా షూటింగ్ ప్రారంభించేందుకు ప్లానింగ్ జరుగుతోంది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
-
Home
-
Menu