అమెరికాలో ‘ఖలేజా’ కలెక్షన్స్!

అమెరికాలో ‘ఖలేజా’ కలెక్షన్స్!
X
ప్రెజెంట్ రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది మహేష్ బాబు 'ఖలేజా'. 2010లో మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖలేజా’ సినిమా మొదట బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

ప్రెజెంట్ రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది మహేష్ బాబు 'ఖలేజా'. 2010లో మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖలేజా’ సినిమా మొదట బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

అయితే కాలక్రమంలో ఈ చిత్రానికి కల్ట్ స్టేటస్ దక్కింది. టీవీ టెలికాస్ట్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా క్రేజ్ పెరిగి, 'ఖలేజా' ఓ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. రేపు (మే 30) 'ఖలేజా' 4K వెర్షన్‌లో రీ రిలీజ్ కానుంది.

ఇప్పటికే వరల్డ్ వైడ్ గా బుక్ మై షో లో 'ఖలేజా' చిత్రానికి బుకింగ్స్ అదిరిపోయే రేంజులో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో ప్రీ సేల్స్ లో అదరగొట్టింది ఈ చిత్రం. ఇవాళ్టికి (మే 29) 'ఖలేజా' యు.ఎస్.ఎ. ప్రీ-సేల్స్ ద్వారా 45,740 డాలర్లును కొల్లగొట్టింది.

అమెరికాలో దాదాపు 100 లొకేషన్లలో 'ఖలేజా' గ్రాండ్ గా రీ-రిలీజ్ అవుతుంది. మరికొద్ది గంటల్లోనే అక్కడ ప్రీమియర్స్ పడనున్నాయి. మొత్తంగా.. అమెరికాలో తొలి రోజు 'ఖలేజా' 100K డాలర్స్ వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి.

Tags

Next Story