నిర్మాతలు - ఫెడరేషన్ మధ్య కీలక సమావేశం

నిర్మాతలు - ఫెడరేషన్ మధ్య కీలక సమావేశం
X
వర్క్ షిఫ్ట్‌లకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌ కావాలన్న డిమాండ్ - నాన్ మెంబర్స్‌తో పని చేసే అవకాశం కోరిన నిర్మాతలు

సినిమా రంగంలో వర్కింగ్ కండిషన్లను మెరుగుపరచే ఉద్దేశంతో ఫెడరేషన్ ప్రతినిధులు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, నిర్మాతల మధ్య ముఖ్యమైన కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో నిర్మాతలు నాలుగు ముఖ్యమైన ప్రతిపాదనలు ఫెడరేషన్ ముందుంచారు.

నిర్మాతలు సూచించిన మొదటి అంశం కాల్ షీట్ల వ్యవహారంపై ముందుగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది.వీటిలో ప్రధానంగా వర్క్ షిఫ్ట్‌లు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలనీ, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్లు అనుమతించాలని అభిప్రాయపడ్డారు.

రెండో ప్రతిపాదన ప్రకారం, ఫెడరేషన్‌కు చెందిన నిపుణులు అందుబాటులో లేని సందర్భాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నిపుణులతోనైనా సరే, స్కిల్ ఆధారంగా నాన్ మెంబర్స్‌తోనైనా పని చేయడానికి అవకాశం ఇవ్వాలని అనే అంశాన్ని ప్రతిపాదించారు.

నిర్మాతలు ప్రతిపాదించిన మూడోవ అంశం ప్రకారం షూటింగ్ ఎక్కడ జరిగినా "రేషియో" అనే పరిమితి ఉండకూడదన్నారు.ఈ విధంగా చేయటం ద్వారా అవసరానుసారంగా ఉద్యోగులను తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది అన్నారు.షూటింగ్ ఎక్కడ చేసినా ఎంతమంది వర్కర్లు కావాలో, తామే నిర్ణయించుకోవాలని నిర్మాతలు చెప్తున్నారు. ‘రేషియో’ అనే పరిమితి ఉండకూడదన్నారు.

చివరిగా, సెకండ్ సండేలు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో పని చేస్తే డబుల్ కాల్ షీట్ ఇవ్వాలనీ, కానీ మిగిలిన సాధారణ ఆదివారాల్లో మాత్రం సింగిల్ కాల్ షీట్ వర్తించాలనే ప్రతిపాదనను చేశారు.

Tags

Next Story