ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక చర్చలు

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక చర్చలు
X
తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న కార్మికుల సమ్మె పరిష్కార దిశగా ఫిల్మ్ ఛాంబర్‌లో ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ సభ్యులు, ప్రముఖ నిర్మాతలు హాజరయ్యారు.

తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న కార్మికుల సమ్మె పరిష్కార దిశగా ఫిల్మ్ ఛాంబర్‌లో ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ సభ్యులు, ప్రముఖ నిర్మాతలు హాజరయ్యారు.

ఫిల్మ్ ఛాంబర్ తరఫున అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ ప్రసన్నకుమార్ హాజరయ్యారు. ఫెడరేషన్ వైపు నుండి కోఆర్డినేషన్ ఛైర్మన్ వీరశంకర్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత తదితరులు పాల్గొన్నారు.

నిర్మాతల వర్గం నుండి ప్రముఖులు దిల్ రాజు, సి. కళ్యాణ్, భోగవల్లి బాపినీడు, ఆచంట గోపినాథ్, ఠాగూర్ మధు, మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ, జెమిని కిరణ్, ఎస్.కె.ఎన్, సుప్రియా యార్లగడ్డ, వివేక్ కూచికబోట్ల, స్రవంతి రవి కిషోర్, దర్శకులు తేజ, వై.వి.ఎస్. చౌదరి, రామ సత్యనారాయణ తదితరులు ఈ చర్చల్లో భాగమయ్యారు.

వేతనాల పెంపు, పనివాతావరణం మెరుగుదల, చిన్న నిర్మాతలకు సౌకర్యాలు వంటి పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. సమ్మెతో చిత్రీకరణలు ఆగిపోవడంతో, సమస్యను త్వరగా పరిష్కరించాలని అన్ని వర్గాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Tags

Next Story