గ్రాండ్ గా కీర్తి సురేశ్ పెళ్ళి ఆల్బమ్ !

గ్రాండ్ గా కీర్తి సురేశ్ పెళ్ళి ఆల్బమ్ !
X

అందాల కీర్తి సురేష్ తన పెళ్లి వేడుకలో చివరి ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలకు #NYKE అనే హ్యాష్‌ట్యాగ్ ఇచ్చింది. గోవాలో జరిగిన ఈ వేడుకలో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా మెరిసిపోతోంది. మెరుస్తున్న ఆకుపచ్చ రంగు స్లీవ్‌లెస్ కట్‌ఔట్ జంప్‌ సూట్‌లో కీర్తి అందాల సందడి చేసింది. భర్త ఆంటోని తట్టిల్‌తో కలిసి పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, చేతులు పట్టుకుని మధుర క్షణాలను ఆస్వా దించింది.

కీర్తి గ్రీన్ డ్రెస్సులో గ్లామరస్‌గా కనిపిస్తే.. ఆంటోని పూర్తిగా బ్లాక్ బ్లేజర్, ప్యాంట్ ధరించి స్టైలిష్ లుక్‌లో మెరిశాడు. అంతేకాదు, అతను తన నెయిల్స్ కూడా బ్లాక్ కలర్‌లో మ్యాచ్ చేసుకోవడం విశేషం. ఇద్దరూ కలసి అద్భుతమైన జోడిగా మెరిసారు. ఈ వేడుకలో కీర్తి డీజేగా మారి మ్యూజిక్‌ను హైలైట్ చేసింది. ఆమె సెట్ చేసిన సంగీతంతో వేడుక మరింత సందడిగా మారింది.

ఇదిలా ఉండగా, కీర్తి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘బేబీ జాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కానీ, ఆ చిత్రంలోని పాటలు వైరల్ అయ్యాయి. మరోవైపు, ఆమె తన నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ‘అక్క’ కోసం సన్నద్ధమవుతోంది. ఇందులో ఆమె పూర్తిగా భిన్నమైన, రగ్డ్ లుక్‌లో కనిపించనుంది.

Tags

Next Story