‘కల్కి 2898 ఏడీ 2’ లో కీర్తి సురేశ్ ?

‘కల్కి 2898 ఏడీ 2’ లో కీర్తి సురేశ్ ?
X

'కల్కి 2898 ఏడీ' చిత్ర బృందం.. దీపికా పదుకొణె రెండవ భాగంలో నటించదని ప్రకటించింది. ఈ విషయం దేశం మొత్తానికీ షాక్‌గా మారింది. దీపికా పదుకొణె డిమాండ్ల గురించి చాలా పుకార్లు ఉన్నప్పటికీ, ఆ నటి ఇప్పటివరకు స్పందించలేదు. దీపికా పదుకొణె స్థానంలో సరైన నటి కోసం చిత్ర బృందం అన్వేషణ మొదలుపెట్టింది. తాజా పరిణామం ఏమిటంటే, మేకర్స్ ఆ పాత్ర కోసం కీర్తి సురేష్‌ను పరిశీలిస్తున్నారు.

కీర్తి సురేష్, 'కల్కి 2898 ఏడీ' దర్శకుడైన నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన 'మహానటి' చిత్రంలో టైటిల్ పాత్ర పోషించింది. ఆ పాత్రకు కీర్తి సురేష్‌ను తీసుకోవడానికి ఆయన ఆసక్తిగా ఉన్నారు. కల్కి మొదటి భాగంలో కీర్తి సురేశ్ వాయిస్ ను ప్రోమో కోసం ఉపయోగించుకున్నారు మేకర్స్. అందుకే ఇప్పుడు ఆమెను కథానాయికగా నటింపచేయాలని నిర్ణయించుకున్నట్టు టాక్ . ఆ విషయంలోనే ఇప్పుడు కీర్తితో చర్చలు జరుగుతున్నాయట.

ప్రస్తుతానికి ఏదీ ఖరారు కాలేదు. చిత్ర బృందం దీపికా పదుకొణెకు సరైన ప్రత్యామ్నాయాన్ని ఖరారు చేయగానే త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రభాస్ వచ్చే ఏడాది 'కల్కి 2898 ఏడీ ' సీక్వెల్ సెట్స్‌లో చేరనున్నాడు. అతడు లేకుండా ఉండే ఎపిసోడ్స్‌ను షూట్ చేస్తారు. వైజయంతి మూవీస్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Tags

Next Story