‘ఎల్లమ్మ’ కోసం కీర్తి సురేష్ ఫిక్స్!

నితిన్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ లిస్టులో 'ఎల్లమ్మ' ఒకటి. 'ఎల్లమ్మ' సినిమా తన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలవబోతుందని లేటెస్ట్ గా 'రాబిన్‌హుడ్' ప్రమోషన్స్ లో చెబుతున్నాడు నితిన్. 'బలగం' వంటి సూపర్ హిట్ తర్వాత వేణు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు.
'ఎల్లమ్మ' సినిమాని సైతం రూరల్ బ్యాక్ డ్రాప్ తో మరింత మాస్ అప్పీల్ తో తెరకెక్కించనున్నాడట వేణు. అలాగే సాంప్రదాయ కథలకు తనదైన టచ్ ఇచ్చే వేణు, ఈ కథనూ సమాజాన్ని ప్రతిబింబించే విధంగా భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించనున్నాడని టాక్.
దిల్‌రాజు ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంకోసం సంగీత దర్శకులుగా హిందీ, మరాఠీలలో పలు విజయవంతమైన సినిమాలకు పనిచేసిన అజయ్-అతుల్ డ్యూయోని తీసుకున్నారు.
మే నుంచి పట్టాలెక్కే ఈ మూవీకోసం హీరోయిన్ గా తొలుత సాయి పల్లవి పేరును పరిశీలించారు. ఇప్పుడు ఈ చిత్రంకోసం కీర్తి సురేష్ ఆన్‌బోర్డులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆద్యంతం తెలంగాణ నేపథ్యంలో వచ్చిన రూరల్ రస్టిక్ స్టోరీ 'దసరా'లో వెన్నెల పాత్రలో అదరగొట్టింది కీర్తి. ఇప్పుడు 'ఎల్లమ్మ' కోసం మరోసారి తెలంగాణ అమ్మాయిగా మురిపించనుందట. త్వరలోనే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించనున్నారట.
-
Home
-
Menu