కీరవాణి సంగీత కచేరి.. చిరు స్టైల్ ప్రోమో!

ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మార్చి 22న హైదరాబాదులో నిర్వహించనున్న సంగీత కచేరీ కోసం మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్‌లో ప్రోమో ఇచ్చారు. కీరవాణి షేర్ చేసిన వీడియోలో చిరంజీవి 'బంగారు కోడిపెట్ట' కోసం వెతుకుతున్నట్లు నటిస్తూ వినూత్నంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
చిరంజీవి ప్రోమోలో తన ఇంట్లో బంగారు కోడిపెట్ట తప్పిపోయిందని, అది మార్చి 22న కీరవాణి మ్యూజిక్ కాన్సర్ట్‌లో దొరకబోతుందని సరదాగా తెలిపారు. అభిమానులను ఆ కాన్సర్ట్‌కి ఆహ్వానిస్తూ, తమ తరపున 'బంగారు కోడిపెట్ట'ను పట్టుకొచ్చేయాలని కోరారు.
కీరవాణి ఈ వీడియోని షేర్ చేస్తూ.. 'బంగారు కోడిపెట్ట' పాట తనకు ఎంతో ప్రత్యేకమని, మార్చి 22న ప్రేక్షకుల కోసం మళ్లీ దాన్ని తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలియజేశారు. 1992లో విడుదలైన చిరంజీవి 'ఘరానా మొగుడు' అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలోని బంగారు కోడిపెట్ట పాట యువతను ఊపేసింది. ఆ తర్వాత 'మగధీర' కోసం ఇదే పాటను రీమిక్స్ చేశారు.
-
Home
-
Menu