'మార్షల్'గా మారిన కార్తీ!

వినూత్న కథలతో ప్రేక్షకులను మెప్పించే హీరో కార్తీ తన 29వ సినిమాకు ‘మార్షల్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. ‘తానాక్కారన్’ ఫేమ్ తమిజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై SR ప్రకాష్ బాబు, SR ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘సత్యం సుందరం’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కార్తీ, ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో తీర్చిదిద్దనున్నారట.
తీరప్రాంతం, సముద్రం నేపథ్యంగా ఈ సినిమా ఉండబోతున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. అయితే.. ఈ మూవీ నుంచి కార్తీ ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు. ముహూర్తంతో పాటు ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలు పెట్టుకుంది. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరి రావు, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే సాయి అభ్యంకర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
-
Home
-
Menu