దుబాయ్ లో 'కన్నప్ప' ట్రైలర్!

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ను ఆడియన్స్ కు దగ్గర చేసేందుకు వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు. డా.మంచు మోహన్ బాబు నిర్మాణంలో, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది.
లేటెస్ట్ గా రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'కన్నప్ప' టీమ్ సందడి చేసింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ, 'ఇది నాకు ఓ ఆధ్యాత్మిక ప్రయాణం. ఆంజనేయ స్వామి భక్తుడిగా ఉన్న నేను, ఈ సినిమా ద్వారా శివ భక్తుడిగా మారాను. సినిమా గొప్పదనాన్ని తెరపై చూడాల్సిందే' అని చెప్పారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర కీలకం కానుందని, ప్రేక్షకుల అంచనాలను మించేలా సినిమాను రూపొందించామని విష్ణు తెలిపారు. ఈ తరానికి తగిన విధంగా 'కన్నప్ప' కథను గొప్ప విజువల్ ఎఫెక్ట్స్‌తో మలిచామని టీమ్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ చిత్రం ట్రైలర్ ను ఏప్రిల్ 5న దుబాయ్‌లో గ్రాండ్ గా లాంఛ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
-
Home
-
Menu