‘కన్నప్ప‘ శాటిలైట్, ఓటీటీ డీల్?

మంచు విష్ణు కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రం ‘కన్నప్ప‘. శివ భక్తుడు కన్నప్ప కథతో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజయ్యింది.జూన్ 27న విడుదలైన ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే.. ఆ టాక్ కలెక్షన్లుగా మారడంలో కాస్త విఫలమయ్యిందనే చెప్పాలి.
తెలుగులో మంచి టాక్ తెచ్చుకున్నా.. పరభాషల్లో ‘కన్నప్ప‘కి పెద్దగా రెస్పాన్స్ లేదు. ఇప్పటివరకూ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో లో ‘కన్నప్ప‘కి 5 లక్షల టికెట్లు అమ్ముడైనట్టు ప్రకటించింది టీమ్. అలాగే ఆన్ లైన్ కంటే ఆఫ్ లైన్ లో ‘కన్నప్ప‘కి ఎక్కువ టిక్కెట్లు అమ్ముడవుతున్నాయని ఇప్పటికే చిత్రబృందం తెలిపింది.
లేటెస్ట్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ కి మంచి ఆఫర్లు వస్తున్నాయట. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఇంకా.. ఓటీటీ రైట్స్ కి కూడా పలు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. మొత్తంగా.. విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘కన్నప్ప‘ భారీ విజయాన్ని సాధించకపోయినా.. మంచు వారబ్బాయికి సేఫ్ ప్రాజెక్ట్ గానే నిలవబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
-
Home
-
Menu