రాష్ట్రపతి భవన్‌లో ‘కన్నప్ప’ ప్రదర్శన

తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచే విధంగా 'కన్నప్ప' చిత్రాన్ని ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు హాజరై చిత్రాన్ని వీక్షించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ ఘట్టం, తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని తీసుకొచ్చిన మైలురాయిగా నిలిచింది.
శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రం, అద్భుతమైన భావోద్వేగాలు, విజువల్స్, ఆధ్యాత్మికతతో అందరినీ అలరించింది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు అత్యంత హృద్యంగా ఉండటంతో, ఈ సినిమా ప్రేక్షకులపై గాఢమైన ముద్రను వేసింది. కన్నప్ప పాత్రలో విష్ణు నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అతిథి పాత్రల్లో నటించిన ప్రభాస్, మోహన్ లాల్ రోల్స్ కు గుడ్ రెస్పాన్స్ దక్కింది. థియేట్రికల్ గా తెలుగు రాష్ట్రాల్లో 'కన్నప్ప'కు మంచి వసూళ్లు దక్కాయి.
-
Home
-
Menu