జూన్ 25 నుంచి 'కన్నప్ప' బుకింగ్స్!

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన పౌరాణిక చిత్రం 'కన్నప్ప' జూన్ 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే అమెరికాలో బుకింగ్స్ మొదలైపోయాయి. భారతదేశంలో జూన్ 25 నుంచి టికెట్లు అమ్మకానికి రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5,400 స్క్రీన్లలో భారీగా విడుదల కానున్న ఈ సినిమా ఇండియాలో 4,300 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 1,100 స్క్రీన్లతో భారీ ఓపెనింగ్‌కు సిద్ధమవుతోంది.
IMAX, 4DX, స్క్రీన్ X లాంటి ప్రీమియం ఫార్మాట్లలో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. యూఎస్‌లోనే 200కు పైగా ప్రీమియర్ షోలు ప్లాన్ చేయడం గమనార్హం. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం లాంటి స్టార్ క్యాస్ట్, వేటా వర్క్‌షాప్స్ విజువల్స్, స్టీఫెన్ దేవస్సీ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు అని చెబుతోంది టీమ్.
ఓవర్సీస్ హక్కులను పొందిన వాసరా ఎంటర్టైన్‌మెంట్ ఇప్పటికే అమెరికాలో 'కన్నప్ప' థియేటర్ల లిస్టును షేర్ చేసింది. అమెరికాలో బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుందట. భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న 'కన్నప్ప' డే వన్ ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.
-
Home
-
Menu