
‘కన్నప్ప‘ యాక్షన్ మేకింగ్ వీడియో

మంచు విష్ణు కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. భక్త కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ప్రచారాన్ని వేగవంతం చేసింది టీమ్.
ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, రెండు పాటలకు మంచి స్పందన దక్కింది. లేటెస్ట్ గా ఓ యాక్షన్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఎక్కువగా న్యూజిలాండ్ లో చిత్రీకరించిన ఈ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా.. ఈ మూవీలోని పలు కీలక యాక్షన్ ఘట్టాలను హీరో విష్ణు స్వయంగా కంపోజ్ చేయడం విశేషం.
ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి తారాగణం కేమియోలలో మురిపించబోతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ‘కన్నప్ప స్టోరీస్’ పేరుతో ప్రమోషన్ యాత్ర ప్రారంభించిన విష్ణు.. న్యూజెర్సీ, డల్లాస్, టెక్సాస్, శాన్ ఫ్రాన్సిస్కోలో అభిమానులను కలుసుకుంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతున్నాడు.
-
Home
-
Menu