రామ్ సినిమాలో కన్నడ స్టార్?

ఎనర్జిటిక్ స్టార్ రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'ఆంధ్రా కింగ్ తాలూకా' అనే పేరు పరిశీలనలో ఉంది. మే నెలలో రామ్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారట. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించడం, ఆయన ఓ.కె. చెప్పడం జరిగింది. అయితే.. ఎందుకనో ఇప్పుడు మోహన్ లాల్ ఈ సినిమాలో నటించడం లేదట.
మోహన్ లాల్ కోసం అనుకున్న పాత్రను కన్నడ స్టార్ ఉపేంద్ర చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రామ్ మూవీలో ఉపేంద్ర ఎంట్రీపై అధికారిక ప్రకటన రానుందట. మరోవైపు ఈ ఏడాది దసరా లేదా దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
-
Home
-
Menu