కళ్యాణ్ రామ్ మాస్ అవతార్

కళ్యాణ్ రామ్ 'అర్జున్ S/O వైజయంతి' ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్ లకు మంచి స్పందన వచ్చింది. ఈ వేసవిలో విడుదలకు ముస్తాబవుతోన్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది.
ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గా ‘నాయాల్ది’ అనే పాటను విడుదల చేస్తున్నారు. అందుకు సంబంధించి అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజయ్యింది. ఇది పూర్తి మాస్ నంబర్‌గా ఉండే పాట. ఇందులో కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు చేయనటువంటి డ్యాన్స్ మూమెంట్స్ తో అలరిస్తాడట. ఈ ఫస్ట్ సింగిల్‌ను మార్చి 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
'అర్జున్ S/O వైజయంతి' ప్రస్తుతం సినీ ప్రేమికులలో భారీ అంచనాలను నెలకొల్పుతోంది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, సయీ మంజ్రేకర్, సోహైల్ ఖాన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.
-
Home
-
Menu