కళ్యాణ్ రామ్ 21వ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్!

X
కళ్యాణ్ రామ్ 21వ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్!నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. కళ్యాణ్ రామ్ 21వ చిత్రంగా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ అయ్యింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లీకొడుకులుగా నటిస్తున్న ఈ మూవీకి 'అర్జున్ S/O వైజయంతి' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేసారు.
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, అశోక్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జోడీగా సయీ మంజ్రేకర్ నటిస్తుంది. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story
-
Home
-
Menu