దీపికకు కబీర్ ఖాన్ మద్దతు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. ఇటీవల ప్రభాస్ ‘స్పిరిట్‘ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ క్రేజీ మూవీ నుంచి దీపిక తప్పుకోవడానికి సోషల్ మీడియాలో వివిధ రకాల ఊహాగానాలు వినిపించాయి. ఆమె నిర్దిష్టంగా రోజుకు 8 గంటల పనివేళలు కోరినట్టు, అలాగే రూ.25 కోట్లు పారితోషికం అడిగినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. దీపిక పెట్టిన పని గంటలు కండిషన్ ను ఆయన సమర్థించారు. ‘ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం ముఖ్యం. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా రోజుకు 8 గంటలే పని చేస్తారు. నేను కూడా ఎప్పుడూ 12 గంటలకు మించి షూటింగ్ చేయను. ఆదివారాల్లో పని చేయను‘ అంటూ స్పష్టం చేశారు కబీర్ ఖాన్.
అలాగే దీపిక అడిగిన రెమ్యూనరేషన్ విషయానికొస్తే, స్టార్లను వారి మార్కెట్ వాల్యూ ప్రకారమే చూడాలని, వారి డిమాండ్‌కు అనుగుణంగా పారితోషికం ఉండటం సహజమేనని కబీర్ ఖాన్ అన్నారు. మొత్తంగా ‘స్పిరిట్‘ మూవీ వివాదంపై దీపిక పదుకొణె అధికారికంగా స్పందించకపోయినా, ఆమెకు మద్దతుగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
-
Home
-
Menu