ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ‘జూనియర్’

ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జూనియర్’. జూలై 18న ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్‌ల మేళవింపుగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా కిరీటి తెలుగు సినీ పరిశ్రమకు తొలి అడుగుపెట్టాడు. తొలి సినిమానే భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్‌తో తెరకెక్కడం విశేషం.
ఈ సినిమాకు రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా, వారాహి చలనచిత్రం నిర్మించింది. ఈ చిత్రంలో కిరీటికి జోడీగా శ్రీలీల నటించగా, జెనీలియా కీలక పాత్రలో కనిపించింది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా ఈ మూవీకి ప్లస్ పాయింట్స్.
తెలుగు రాష్ట్రాల్లో 'జూనియర్' సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ముఖ్యంగా కిరీటి రెడ్డి స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, ఫైట్స్ లోని ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని పలువురు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ తరహాలో కిరిటీ డ్యాన్సులు అదరగొట్టాడనే రీల్స్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
ఈనేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణపై హీరో కిరీటి సోషల్ మీడియాలో స్పందించాడు. తన 'ఎక్స్' ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. 'తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. ‘జూనియర్’కు వస్తున్న ప్రేమ, ఆదరణను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఎంతో నిజాయితీగా, హృదయపూర్వకంగా ఈ సినిమాను తీశాం. మీకు మంచి సినిమాలు అందించడానికి మేము ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటాం. మీ ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను' అంటూ తన కృతజ్ఞతలు తెలిపాడు.
తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు.
— Kireeti (@KireetiOfficial) July 19, 2025
‘జూనియర్’కు వస్తున్న ప్రేమ, ఆదరణను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది.
మేము ఎంతో నిజాయితీగా, హృదయపూర్వకంగా ఈ సినిమాను తీశాం.
మీకు మంచి సినిమాలు అందించడానికి మేము ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటాం.
మీ ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని… pic.twitter.com/TFEqkUHd4M
-
Home
-
Menu