'జూనియర్' గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా, దర్శకుడు రాధా కృష్ణ రూపొందించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. జూలై 18న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన కిరీటి, శ్రీలీలలతో కలిసి స్టేజ్‌పై ‘వైరల్ వయ్యారి’ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు.
ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, 'కిరీటి డ్యాన్స్, పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయి. అతడిలో ఓ ప్రామిసింగ్ స్టార్ కనిపిస్తున్నాడు. శ్రీలీల ఎనర్జీ అమోఘం. డైరెక్టర్ రాధాకృష్ణ సినిమాను ఎంతో నైపుణ్యంగా తెరకెక్కించారు. కిరీటికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి' అని తెలిపారు.
డీఓపీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ, 'కిరీటి చాలా టాలెంటెడ్. ప్రతి ఫ్రేమ్‌కి న్యాయమిచ్చే ప్రయత్నం చేశాం. డైరెక్టర్ కథను ఎంతో ప్రేమతో చెప్పారు. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్స్‌లో తప్పకుండా ఆస్వాదిస్తారు' అని తెలిపారు.
జెనీలియా ఈ సినిమాతో సౌత్‌కి రీ ఎంట్రీ ఇస్తోంది. 'కిరీటి, శ్రీలీల ఇద్దరూ కొత్తవాళ్లలా కాకుండా చాలా మేచ్యూర్‌గా నటించారు. రాధా గారు గొప్ప దర్శకుడు. సాయి గారు ఎంతో ప్రేమతో ఈ సినిమాను రూపొందించారు. ‘జూనియర్’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది' అని చెప్పారు.
గాలి జనార్దన్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడుతూ, 'కిరీటి చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డ్యాన్సింగ్ పట్ల ఆసక్తితో పెరిగాడు. అతడిలోని ప్యాషన్‌ను చూస్తే అతను మంచి నటుడిగా ఎదుగుతాడని నమ్మకం ఉంది. ఈ సినిమా కథ మన ఇంట్లో జరిగే సంఘటనల మాదిరిగా ఉంటుంది. ప్రేక్షకులు తప్పకుండా ప్రేమిస్తారు' అని అన్నారు.
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ, 'ఈ సినిమాతో నా జర్నీ ఎంతో వండర్‌ఫుల్‌గా సాగింది. కిరీటితో పని చేయడం గొప్ప అనుభవం. డ్యాన్స్‌లో ఆయన ఎనర్జీ అమోఘం. డైరెక్టర్ రాధా గారి విజన్ స్పష్టంగా కనిపించింది. దేవిశ్రీ సంగీతం సినిమాకి బలం' అని చెప్పింది.
హీరో కిరీటి మాట్లాడుతూ, 'శివన్న గారు, అప్పు గారు నాకు ఇన్‌స్పిరేషన్. ఈ సినిమా కోసం చాలా మంది ఎంతో ప్రేమగా కష్టపడ్డారు. డైరెక్టర్ రాధా గారు బ్రదర్ లా సపోర్ట్ చేశారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, సెంథిల్ గారి విజువల్స్ మా సినిమాకు పెద్ద అస్త్రాలు. శ్రీలీల వంటి ఎనర్జిటిక్ కోస్టార్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది.' అన్నారు.
-
Home
-
Menu