జానీ vs ఫిలిం ఛాంబర్ – వివాదం ముదురుతోందా?

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ, ఫిలిం ఛాంబర్ మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు పాలై, అనంతరం బెయిల్‌పై విడుదలైన జానీపై ఫిలిం ఛాంబర్ కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై జానీ సవాలు చేస్తూ వేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసినట్లు ఫిలిం ఛాంబర్ ప్రతినిధిగా ఝాన్సీ సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఝాన్సీ పోస్ట్‌లో 'మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించడం ఎంతో ముఖ్యమైన విషయం. POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు మద్దతు ఉంది' అని పేర్కొన్నారు.
ఇందుకు కౌంటర్‌గా జానీ స్పందిస్తూ 'తప్పుడు ప్రచారాలు చేస్తూ, కోర్టు తీర్పులను వక్రీకరిస్తున్నారు. అసలు నిజాలు బయటకు వచ్చినప్పుడు ఎవరి నిజస్వరూపం ఏంటో అందరికీ అర్థమవుతుంది' అని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిణామంతో కొరియోగ్రాఫర్ జానీ, ఫిలిం ఛాంబర్ మధ్య వివాదం మరింత ముదిరింది. తుది తీర్పు వెలువడే వరకు ఈ వివాదం కొనసాగే అవకాశముంది.
-
Home
-
Menu