'జన నాయగన్' ఫస్ట్ రోర్!

తమిళ దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రంగా ప్రచారంలో ఉంది ‘జన నాయగన్’. హెచ్.వినోధ్ దర్శకత్వంలో కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే పొంగల్ స్పెషల్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా పూజా హెగ్డే, మమిత బైజు నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, వరలక్ష్మి శరత్‌కుమార్, రేవతి తదితరులు కనిపించనున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఫస్ట్ రోర్ పేరుతో స్పెషల్ గ్లింప్స్ రాబోతుంది. జూన్ 22న విజయ్ బర్త్ డే స్పెషల్ గా ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది టీమ్. జూన్ 22 అర్ధరాత్రి 12 గంటలకు 'జన నాయగన్' నుంచి ఫస్ట్ రోర్ గ్లింప్స్ వీడియోను విడుదల చేయబోతున్నారు.
విజయ్ కి రాజకీయంగానూ ఉపయోగపడేలా 'జన నాయగన్'ను తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, అనల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
A lion is always a lion
— KVN Productions (@KvnProductions) June 20, 2025
& his first roar is incoming 🔥
June 22 | 12.00 AM#JanaNayaganTheFirstRoar #JanaNayagan#Thalapathy @actorvijay sir #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol @_mamithabaiju @prakashraaj @menongautham #Priyamani @itsNarain @Jagadishbliss… pic.twitter.com/a0PZ67R4MF
-
Home
-
Menu