‘అవతార్ 3’ అందరికీ కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది : జేమ్స్ కామరూన్

‘అవతార్ 3’ అందరికీ కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది : జేమ్స్ కామరూన్
X
‘‘అవతార్: ఫైర్ అండ్ అష్ లో ఎక్కువ సాహసాలు, ఉత్సాహభరితమైన సన్నివేశాలు ఉంటాయని దర్శకుడు చెప్పాడు.

హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అవతార్ 3’ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తాజా అప్‌డేట్స్ కోసం వరల్డ్ వైడ్ గా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా.. దర్శకుడు జేమ్స్ కామరూన్ ‘అవతార్ 3’ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అవతార్: ఫైర్ అండ్ అష్ లో ఎక్కువ సాహసాలు, ఉత్సాహభరితమైన సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. “ఈ సినిమాలో చాలా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఇది మీ రక్తాన్ని సలసలా మరిగేలా చేస్తుంది. కానీ.. 70 ఏళ్ల వయసులోకి వచ్చిన నాపై వ్యక్తిగతంగా ముద్ర వేసిన ఒక కళాకారుడిగా.. ఈ సారి మరింత లోతైన కథనం, ఆవిష్కరణలతో ‘అవతార్ 3’ ద్వారా అందరికీ కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాను’.. అని కామరూన్ చెప్పాడు.

‘ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోకపోతే, మీరు అందరి సమయాన్ని, డబ్బును వృథా చేస్తున్నట్లే. అది విజయానికి సరిపడదు. అని కామరూన్ తన మాటలను ముగించాడు. అవతార్: ఫైర్ అండ్ అష్ ఈ సంవత్సరం డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ భాగం ఏ రేంజ్ లో ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి.

Tags

Next Story