'జాట్' ట్రైలర్.. మాస్ ఫీస్ట్ లోడింగ్!

జాట్ ట్రైలర్.. మాస్ ఫీస్ట్ లోడింగ్!
X
బాలీవుడ్ లో సన్నీ డియోల్ అంటే మాస్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సినిమాలకు పేరు. ఇప్పుడు అవే ఎలిమెంట్స్ తో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ తెరకెక్కించిన చిత్రం 'జాట్'.

బాలీవుడ్ లో సన్నీ డియోల్ అంటే మాస్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సినిమాలకు పేరు. ఇప్పుడు అవే ఎలిమెంట్స్ తో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ తెరకెక్కించిన చిత్రం 'జాట్'. ఈ సినిమాలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజానీ, జగపతిబాబు, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న 'జాట్' ఏప్రిల్ 10న విడుదలకు ముస్తాబవుతుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.

'జాట్' ట్రైలర్ ఆద్యంతం సన్నీ డియోల్ ఫ్యాన్స్ కు మాస్ట్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా హీరో సన్నీ డియోల్, విలన్ రణదీప్ హుడా మధ్య వచ్చే సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంగా బాలీవుడ్ లో 'గదర్ 2' వంటి భారీ విజయం తర్వాత సన్నీ డియోల్ నుంచి వస్తోన్న 'జాట్' కూడా సూపర్ హిట్ సాధిస్తుందేమో చూడాలి.


Tags

Next Story