‘జాట్’ సీక్వెల్ కన్ఫమ్!

‘జాట్’ సీక్వెల్ కన్ఫమ్!
X
సన్నీ డియోల్ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘జాట్‘ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

సన్నీ డియోల్ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘జాట్‘ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 7 రోజులకు రూ.70.4 కోట్లు వసూళ్లను కొల్లగొట్టింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద ‘జాట్‘ రన్ జోరుగా కొనసాగుతుంది.

హీరోగా టైటిల్ రోల్ లో సన్నీ డియోల్, విలన్ గా రణదీప్ హుడా నటనకు చాలా మంచి పేరు వచ్చింది. ఇంకా కీలక పాత్రల్లో సయామీ ఖేర్, రెజీనా, వినీత్ కుమార్ సింగ్ క్యారెక్టర్స్ ఆకట్టుకున్నాయి. తమన్ అందించిన మ్యూజిక్ ‘జాట్‘కి మరో ప్లస్ పాయింట్.

మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్త నిర్మాణంలో రూపొందిన ‘జాట్‘కి ఇప్పుడు సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఈసారి కొత్త మిషన్ లో రాబోతున్న ‘జాట్‘.. మరింతగా మాస్ ఫీస్ట్ అందిస్తాడని నిర్మాణ సంస్థలు ‘జాట్ 2‘ని అధికారికంగా ప్రకటించాయి.



Tags

Next Story