విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘జాట్‘

ఇండియాలోని అన్ని వుడ్స్ ఇప్పుడు టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టాయి. మన హీరోలతో పనిచేయడానికి పరభాషా దర్శకులు పోటీపడుతుంటే.. మన డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి పరభాషా కథానాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈకోవలోనే సెట్టైంది సన్నీడియోల్ - గోపీచంద్ మలినేని కాంబో. వీరిద్దరి కలయికలో రాబోతున్న చిత్రం ‘జాట్‘.
దశాబ్దాలుగా హీరోగా రాణిస్తోన్న సన్నీ డియోల్ కి హిందీలో మాస్ హీరోగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ‘గదర్ 2‘తో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. 'గదర్ 2' చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.700 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ‘జాట్‘ మూవీ రిలీజ్ డేట్ వచ్చింది. ఏప్రిల్ 10న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇప్పటికే టీజర్ తో ఆకట్టుకుంది ‘జాట్‘. టీజర్ లో సన్నీ డియోల్ మాస్ ఎలివేషన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీలో రణ్ దీప్ హుడా, రెజీనా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ కూడా ఏప్రిల్ 10న రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ఇప్పుడు ‘జాట్‘ అదే తేదీకి వస్తుండడంతో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ వాయిదా పడే అవకాశాలున్నాయి.
-
Home
-
Menu