'జాట్' బాక్సాఫీస్ దూకుడు!

బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జాట్'. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. హిందీ సినీ ప్రేక్షకుల కోసం గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ మాస్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.
ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ లభించగా, నాలుగో రోజున అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఆదివారం రోజున ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియెన్స్ అట్రాక్షన్ పెరగడంతో, సినిమాకు మరింత బలమైన వసూళ్లు వచ్చాయి. నాలుగవ రోజునే ఈ సినిమా రూ.14.06 కోట్లు వసూలు చేయడం విశేషం.
ఆదివారం రోజున హిందీ థియేటర్లలో సగటు ఆక్యుపెన్సీ 25.51%గా నమోదయ్యింది. ముఖ్యంగా సాయంత్రం షోల్లో 33.93% ఆక్యుపెన్సీతో 'జాట్' ప్రభావం స్పష్టంగా కనిపించింది. మొత్తంగా నాలుగు రోజులకు రూ.40 కోట్లు వసూళ్లను కొల్లగొట్టింది 'జాట్'.
-
Home
-
Menu