హైదరాబాద్‌లో నిర్మాతలపై ఐటీ దాడులు!

హైదరాబాద్‌లో నిర్మాతలపై ఐటీ దాడులు!
X
హైదరాబాద్‌లో ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాతలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. ప్రముఖ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాతలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత, ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు, వారి సమీప బంధువుల కార్యాలయాలు, కుటుంబ సభ్యుల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.


సంక్రాంతి కానుకగా విడుదలైన 'గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలను దిల్ రాజు నిర్మించారు. అయితే ఈ సినిమాల కలెక్షన్ల విషయంలో అనుమానాలు వ్యక్తం కావడంతో ఈ దాడులు జరిగాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిలో 'గేమ్ ఛేంజర్'పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ కమర్షియల్‌గా విఫలమైంది. 'సంక్రాంతికి వస్తున్నాం' తక్కువ బడ్జెట్ తో రూపొందినా భారీ కలెక్షన్లు రాబట్టి విజయవంతమైందన్న టాక్ ఉంది.


మరోవైపు 'పుష్ప 2'ని నిర్మించిన మైత్రి మూవీస్ నిర్మాతల నివాసాలపైనా కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది చోట్ల 55 బృందాలతో ఈ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

Tags

Next Story