ప్రభాస్‌తో కలిసి నటించడం ఓ అద్భుత అవకాశం : మాళవిక మోహనన్

ప్రభాస్‌తో కలిసి నటించడం ఓ అద్భుత అవకాశం : మాళవిక మోహనన్
X

విభిన్న భాషల్లో తన ప్రతిభను నిరూపించుకున్న అందాల హీరోయిన్ మాళవిక మోహనన్. మలయాళం, తమిళం, హిందీ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది ఆమె. ఇప్పుడు ఆమె తెలుగులో అడుగుపెట్టడానికి సిద్ధమయింది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న "ది రాజా సాబ్" ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది మాళవిక.

ఈ సినిమాలో నటించేందుకు కారణం ఏమిటని అడిగితే.. మాళవిక ఉత్సాహంగా స్పందించింది. "ఇదివరకు నేను చేయని హారర్-కామెడీ జానర్ కావడం ఒక కారణం. అలాగే, ఎక్కువగా పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్ పాత్రకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ, ‘ది రాజా సాబ్’ లో అలా కాదు" అని చెప్పింది. ఆమె పాత్ర గురించి మరింత వివరంగా చెబుతూ.. "ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బలంగా ఉంటుంది. సినిమా మొత్తం నా పాత్రకీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. ముఖ్యంగా, ఇంత భారీ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నాకు మంచి స్కోప్ దొరకడం చాలా అరుదు. దర్శకుడు మారుతి చాలా మంచి వ్యక్తి, ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది" అని చెప్పింది.

ప్రభాస్‌తో నటించే అవకాశం రావడం పట్ల మాళవిక హర్షం వ్యక్తం చేస్తూ - "అన్ని అనుకూలంగా జరిగాయి. నేను ఎప్పటి నుంచో ప్రభాస్‌తో వర్క్ చేయాలను కుంటున్నాను. ఆయనపై నాకు మంచి అభిమానం ఉంది. నేను ‘బాహుబలి’ సినిమా వీరాభిమానిని!" అని తెలిపింది. ఇక ‘ది రాజా సాబ్’ విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు మోహన్‌లాల్ సరసన కథానాయికగా "హృదయపూర్వం" సినిమాలోనూ నటిస్తోంది. ఇలా అన్ని భాషల్లో తన స్థాయిని పెంచుకుంటూ, మరింత భారీ చిత్రాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది మాళవిక మోహనన్.

Tags

Next Story