వెంకీ-చరణ్ సాధ్యమేనా?

వెంకీ-చరణ్ సాధ్యమేనా?
X
'గుంటూరు కారం' తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటివరకూ తన నెక్స్ట్‌ మూవీని పట్టాలెక్కించింది. అల్లు అర్జున్ తో తన తర్వాతి సినిమాని ప్రకటించినా.. ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి చాలానే సమయం పడుతుంది.

'గుంటూరు కారం' తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటివరకూ తన నెక్స్ట్‌ మూవీని పట్టాలెక్కించింది. అల్లు అర్జున్ తో తన తర్వాతి సినిమాని ప్రకటించినా.. ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి చాలానే సమయం పడుతుంది. ఈలోపులో మరో చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్.

విక్టరీ వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ చిత్రాన్ని సోలో హీరో మూవీగా కాకుండా మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నాడట మాటల మాంత్రికుడు. ఈ సినిమాలో వెంకీతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో కథానాయకుడిగా నటించనున్నాడనే ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం 'పెద్ది' సినిమాతో బిజీగా ఉన్న చరణ్.. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే.. అంతకంటే ముందే త్రివిక్రమ్ సినిమాలో వెంకటేష్ తో కలిసి హీరోగా నటిస్తాడనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

గతంలో పవన్ కళ్యాణ్‌తో 'గోపాల గోపాల' చేసిన వెంకటేష్, ఇప్పుడు రామ్ చరణ్‌తో కలసి మరోసారి మల్టీస్టారర్ చేయడానికి ఆసక్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'లో వెంకటేష్-చరణ్ కలిసి ఒకే ఫ్రేములో సందడి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పట్లో వెంకీ-చరణ్ మల్టీస్టారర్ సాధ్యమేనా? అనే చర్చలూ నడుస్తున్నాయి. ఏదేమైనా.. త్రివిక్రమ్ నెక్స్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

Tags

Next Story