'వీరమల్లు' విడుదలకు లైన్ క్లియర్ అయ్యిందా?

వీరమల్లు విడుదలకు లైన్ క్లియర్ అయ్యిందా?
X

'వీరమల్లు' విడుదలకు లైన్ క్లియర్ అయ్యిందా?

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీ గురించి చిత్రబృందం స్పష్టమైన ప్రకటనలు చేస్తూ, మార్చి 28న ఖచ్చితంగా థియేటర్లలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే షూటింగ్ ఇంకా పూర్తవ్వకపోవడంతో అభిమానుల్లో కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ తన పరిపాలనా కార్యక్రమాలతో నిమగ్నమై ఉండడం వలన 'వీరమల్లు' అనుకున్న సమయానికి వస్తోందా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది.

ఒకవేళ ‘హరిహర వీరమల్లు’ మార్చి 28కే వస్తే.. పవన్ అభిమాని అయిన నితిన్ 'రాబిన్ హుడ్'తో పోటీ ఉండే పరిస్థితి ఉంది. నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందుతున్న 'రాబిన్ హుడ్' చిత్రాన్ని మార్చి 28నే తీసుకొస్తున్నారు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమాలో నితిన్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే నితిన్-వెంకీ కుడుమల 'భీష్మ' వంటి హిట్ అందుకోవడంతో 'రాబిన్ హుడ్'పై మంచి అంచనాలున్నాయి.

మరోవైపు మార్చి 29న సితార నుంచి 'మ్యాడ్ స్క్వేర్' కూడా రాబోతుంది. హిట్ మూవీ 'మ్యాడ్'కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న చిత్రమిది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సమ్మర్ స్పెషల్ గా 'మ్యాడ్ స్క్వేర్' యూత్ ని బాగా ఆకట్టుకుంటుందని నమ్ముతుంది టీమ్. ఇంకా మోహన్‌లాల్ మోస్ట్‌అవైటింగ్ మూవీ 'ఎంపురాన్' కూడా మార్చి 27న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్'కి సీక్వెల్ గా 'ఎంపురాన్' తెరకెక్కింది. పృథ్వీరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎంపురాన్'పై పై పాన్ ఇండియా రేంజులో భారీ అంచనాలున్నాయి.

Tags

Next Story