‘నీది పావలా? నాది పావలా?’ కాదు.. బన్నీ వాస్!

ప్రస్తుతం సినిమా విడుదల తర్వాత 3–4 వారాల్లోనే ఓటీటీలోకి వెళ్లిపోతున్న ట్రెండ్, థియేటర్ల భవిష్యత్తును భయానకంగా ప్రభావితం చేస్తోంది. ఈ పోటీ.. పర్సంటేజ్ పంచుకుని ఎవరి వాటా ఎక్కువ అన్న రచ్చ కన్నా, ప్రేక్షకుల్ని మళ్లీ థియేటర్ వైపు ఎలా తీసుకురావాలన్నదే అసలు చర్చ కావాలి అని బన్నీ వాస్ స్పష్టం చేశారు.
ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి…
— Bunny Vas (@TheBunnyVas) June 6, 2025
అర్థరూపాయి వ్యాపారంలో 'నీది పావలా, నాది పావలా' అనే తర్కానికి బదులు, మొత్తం రూపాయి బిజినెస్ ఎలా తిరిగి సాధించవచ్చో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద హీరోలు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి సినిమా చేయడం వల్ల థియేటర్ ఓనర్లు వాటిని నిర్వహించలేక మూసివేయాల్సిన పరిస్థితి వస్తోంది.
ఇలా సాగితే వచ్చే నాలుగైదేళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూతపడే ప్రమాదం ఉంది. మల్టీప్లెక్స్ థియేటర్లే మిగిలితే, పెద్ద సినిమాల వసూళ్లలో నిర్మాతలకి వచ్చే వాటా కేవలం 43% మాత్రమే అవుతుందని బన్నీ వాస్ హెచ్చరిస్తున్నారు.
-
Home
-
Menu