ఆకట్టుకుంటున్న ‘హలగలి‘ టీజర్

X
‘పుష్ప‘ సిరీస్ లో జాలి రెడ్డిగా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు డాలీ ధనుంజయ్. కన్నడలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ధనుంజయ్ లేటెస్ట్ గా ‘హలగలి‘ అనే పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు.
‘పుష్ప‘ సిరీస్ లో జాలి రెడ్డిగా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు డాలీ ధనుంజయ్. కన్నడలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ధనుంజయ్ లేటెస్ట్ గా ‘హలగలి‘ అనే పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు. ఈ సినిమాలో ‘కాంతార‘ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుంది.
సుఖేష్ నాయక్ దర్శకత్వంలో కళ్యాణ్ చక్రవర్తి ధూళిపల్ల నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. లేటెస్ట్గ ఈ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. బ్రిటీష్ ఇండియా కాలంలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హలగలి అనే ఊరిపై దండయాత్ర చేసిన బ్రిటిష్ సైన్యాన్ని, అక్కడి నాయకుడు ఎలా ప్రతిఘటించాడు అన్నదే ఈ మూవీ స్టోరీగా గ్లింప్స్ ను బట్టి తెలుస్తోంది. గ్లింప్స్‌లోని భారీతనం, యాక్షన్ బ్లాక్స్, ధనుంజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటున్నాయి.
Next Story
-
Home
-
Menu